సంబంధిత వార్తలు
- యశోద లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి : కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ
- ఇండియాలో మంచి ఓపెనింగుతో బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్
- తాగిన మైకం.. కొండచిలువను మెడలో వేసుకున్నాడు.. చుక్కలు కనిపించాయ్!
- వ్యాయామం: మానవులు ఎక్సర్సైజ్ చేయటం అసహజమా? చాలా మందికి వ్యాయామం ఎందుకు ఇష్టం ఉండదు?
- శవం వద్ద కూర్చుని మూడు రోజులు ప్రార్థనలు.. పునరుత్థానం కావాలని?
రైలు ఢీకొన్నా.. ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు.. లక్ అంతే అదే! (video)
Man
రైలు మొత్తం అతని మీదుగా వెళ్ళింది. కానీ అతను ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భాగల్ పూర్ స్టేషన్ పట్టాలపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స్టేషన్‌లో ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ ఫామ్ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్ కర్ట్ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు.
పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్ కదిలింది. దీంతో రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో పట్టాల కిందే వుండిపోయాడు. అతనిని చూసిన జనం షాకయ్యారు. రైలు దాటిన తర్వాత షాక్‌తో లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలో వున్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
