సంబంధిత వార్తలు
- బిల్లును వెనక్కి తీసుకుంటూనే.. పూర్తి మార్పులతో వస్తాం... జగన్
- మోదీ 3 రైతు చట్టాలు, జగన్ 3 రాజధానులు: ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్
- అమరావతి ఉద్యమం స్వార్థపూరితం - ప్రభుత్వ నిర్ణయం సముచితం : మంత్రి బొత్స
- రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి బొత్స సత్యనారాయణ
- చిరంజీవి - మోహన్ బాబు వంటి పెద్దలకు లేని దూల పవన్‌కు ఎందుకు : మంత్రి బొత్స
మరింత శక్తివంతంగా 3 రాజధానులు బిల్లుతో వస్తాం: బొత్స సత్యనారాయణ
మూడు రాజధానుల లొల్లి ముగియలేదని చెప్పకనే చెప్పారు ఏపీ మంత్రులు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బిల్లుల ఉపసంహరణపై ప్రసంగం ముగిశాక, మంత్రులు ఎవరికివారు దానిపై స్పందించారు. ముఖ్యంగా బిల్లు విషయంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ బిల్లుకు చిక్కులు తప్పవన్న అభిప్రాయాల నేపథ్యంలో ప్రస్తుత బిల్లు వెనక్కి తీసుకోవడమే మంచిదని ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
3 రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదన్నారు. ప్రస్తుత బిల్లుపై చిన్నచిన్న అపోహలు వున్నాయనీ, వాటిని సరిదిద్ది మరింత శక్తివంతంగా ఈసారి 3 రాజధానుల బిల్లుతో వస్తామన్నారు.
కనుక అమరావతి రాజధాని అనేది కేవలం కొన్నాళ్లు మాత్రమే. ఇంకా 3 రాజధానుల అంశం ముగిసిపోలేదని తేటతెల్లం అయ్యింది. కనుక అమరావతి రైతులు స్వీట్లు పంచున్నప్పటికీ చేదు గుళికలు సిద్ధమవుతాయన్నమాట.
