సంబంధిత వార్తలు
- రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. బిడ్డతో సంతోషంగా వున్నా.. సురేఖా వాణి
- బిగ్‌బాస్-5లో సింగర్ సునీత ఎంట్రీ...
- కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి విద్యార్థినిపై అత్యాచారం.. అర్ధనగ్నంగా ఫోటోలు తీసి..?
- గాయని సునీతకు సరిగమలు భిక్ష పెట్టిన గురువు ఇకలేరు...
- సింగర్ సునీత గురువు కన్నుమూత.. భావోద్వేగ ట్వీట్..
ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం: కల్లు గ్లాసుతో సింగర్ సునీత (video)
సింగర్ సునీత. ఇటీవలే పారిశ్రామికవేత్త రామ్ వీపనేనిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తమ పెళ్లి గురించి, రామ్ ప్రపోజ్ చేసిన విషయం గురించి మీడియాలో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సునీతను ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియా ఛానల్ వారు ప్రత్యేక కార్యక్రమం కోసం ఆహ్వానించారట.
ఈ కార్యక్రమం ప్రగతి రిసార్టులో జరిగింది. అక్కడ తాటిచెట్లు బాగా ఎక్కువగా వుంటాయి. వేసవి కావడంతో గీత కార్మికులు తాటి కల్లును తీసి అమ్ముతుంటారు. ఈ క్రమంలో సింగర్ సునీత పాల్గొంటున్న షో దగ్గరకి కొందరు గీత కార్మికులు తాజా కల్లును తీసుకుని వచ్చారట.
ఆ కల్లును చూడగానే తోటి కళాకారులు కొందరు సిప్ చేస్తూ ఎంజాయ్ చేసినట్లు సమాచారం. పనిలో పనిగా సింగర్ సునీతకు కూడా ఓ గ్లాసు కల్లు ఇచ్చారట. మరి ఆమె వాటిని తాగారో లేదో కానీ కల్లు గ్లాసుతో వున్నట్లు ఫోటోల్లో కనబడ్డారు. ఇప్పుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
