సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (14:53 IST)

గాయని సునీతకు సరిగమలు భిక్ష పెట్టిన గురువు ఇకలేరు...

ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న గాయని సింగర్. ఈమె ఇపుడు శోకసముద్రంలో మునిగిపోయింది. దీనికి కారణం లేకపోలేదు. ఆమెకు సరిగమలను భిక్షపెట్టిన ఆదిగురువు స్వర్గస్తులయ్యారు. ఆయన పేరు పెమ్మరాజు సూర్యారావు. ఆయన చనిపోయారు. ఈ విషయాన్ని ఆమె షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
 
"పెమ్మరాజు సూర్యారావుగారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మ‌హానీయుల్ని కోల్పోతుంటే చాలా బాధగా ఉంది" అని రాసుకొచ్చింది. ఈ మేరకు ఆయన ఫొటోను కూడా షేర్‌ చేసింది సునీత. 
 
ఇదిలావుంటే సునీత జ‌న‌వ‌రిలో శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇది వైర‌ల్‌గా మారింది.