గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (09:59 IST)

సింగర్ సునీత వివాహం ఖరారు.. 9న డుం. డుం. డుం

సింగర్ సునీత వివాహం ఖరారైంది. ఈ మధ్యనే సింగర్ సునీత వివాహం బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని జరగనుంది. నిజానికి వీరి పెళ్లి డిసెంబర్ 26వ తారీఖున జరగనుందని గట్టిగా ప్రచారం జరిగింది. అందుకు ఊతం ఇస్తూ ప్రీ వెడ్డింగ్ పార్టీలు కూడా జరిగానే సాగాయి. అయితే ఆమె పెళ్లి ఎప్పుడు అనే దాని ఇప్పటి దాక పుకార్లే వచ్చాయి. మొట్టమొదటి సునీత తన పెళ్లి డేట్ ప్రకటించింది. 
 
వచ్చే నెల 9వ తేదీన తన వివాహం జరుగనుందని ఆమె పేర్కొంది. బుధవారం తిరుమల దర్శనానికి వెళ్ళిన ఆమె గురువారం తన వివాహ తేదీని ప్రకటించింది. కొత్త జీవితం బాగుండాలని శ్రీవారిని ప్రార్ధించానని కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా శ్రీవారి దర్శనానికి దూరమయ్యానని ఆమె పేర్కొంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా వుందని ఆమె పేర్కొంది.