శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (09:43 IST)

సింగర్ సునీత పెళ్లి ముహూర్తం ఫిక్స్..

ప్రముఖ గాయిని సునీత రెండో పెళ్లి చేసుకోనున్నారు. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగింది. సునీత పెళ్లి విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. దాంతో అంతా కూడా ఆమె వివాహంకు సంబంధించిన తేదీ విషయమై ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రెండు వైపుల కుటుంబ సభ్యులు సునీత రామ్‌ల పెళ్లికి ముహూర్తంను ఖరారు చేయడంతో పాటు అధికారికంగా ప్రకటించారు. 
 
కరోనా కారణంగా పెళ్లిని కూడా రెండు కుటుంబాలు మరియు అత్యంత సన్నిహితుల మధ్యే జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. పెళ్లికి మరీ ఎక్కువ రోజులు పెట్టుకోకుండా ఈ నెల 26నే పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారట. మొదట పెళ్లి వచ్చే ఏడాది ఆరంభంలో పెట్టుకోవాలనుకున్నా కూడా జనవరి నుండి నాలుగు నెలల వరకు మంచి ముహూర్తాలు లేని కారణంగా పెళ్లి ఈ నెలలోనే పెట్టుకోవాలనే నిర్ణయానికి ఇరు ఫ్యామిలీలు వచ్చాయట. సునీత రామ్ వివాహం ప్రైవేట్‌గా ఈ నెల 26న జరుగనుంది.