శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (15:22 IST)

ఒకే వేదికపై తల్లీ కూతుళ్ళ వివాహాలు.. మరిదిని పెళ్లాడిన వదిన

తల్లీ కూతుళ్ళ వివాహాలు ఒకే వేదికపై జరిగాయి. సాధారణంగా తోబుట్టువులు లేదా స్నేహితుల పెళ్ళిళ్ళు ఒకే మండపంలో ఒకే వేదికపై జరగడం చూస్తుంటాం.. కానీ ఇలా తల్లి, కూతురు ఒకే వేదికపై వివాహం చేసుకోవడంతో.. అందరూ వీరి వివాహాల గురించే చర్చించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గోరక్ పూర్ జిల్లాలో ఓ తల్లీ కూతుళ్ళ వివాహాలు ఒకే వేదికపై జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో జగదీష్ అనే వ్యక్తిని బేలాదేవి(53) పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కుమార్తె(27) ఇందు వివాహం కూడా జరిగింది. 
 
బేలాదేవి ఆమె భర్త సోదరుడిని వివాహం చేసుకుంది. వితంతువైన బేలాదేవి వివాహం వారి సంతానం అనుమతితోనే జరిగిందని... తన సంతానం ఒత్తిడితోనే తాను వివాహం చేసుకున్నానని.. బేలాదేవి వివాహం తర్వాత మీడియాతో చెప్పింది. అమ్మకు తోడు కావాలనే బాబాయ్‌తో ఆమె వివాహం జరిపించినట్లు బేలాదేవి కూతుళ్లు వెల్లడించారు.