శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 17 డిశెంబరు 2020 (12:33 IST)

ఏడు రోజుల్లో పెళ్లి, నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

మరో ఏడు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిపై కొందరు గుర్తు తెలియని దుండగులు హత్యా యత్నం చేసారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం సొంపాలెం గ్రామంలో 24 ఏళ్ల యువతికి మరో 7 రోజుల్లో వివాహం జరుగనుంది. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ గురువారం తెల్లవారు జామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె నిద్రిస్తుండగానే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
 
మంటలు చెలరేగడంతో ఆమె కేకలు వేసింది. మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు వచ్చి మంటలను ఆర్పారు. ఐతే అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మదనపల్లి మండలంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా మరేదైనా కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.