శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:12 IST)

సింగర్ సునీత గురువు కన్నుమూత.. భావోద్వేగ ట్వీట్..

సింగర్ సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక మీడియా హౌజ్‌ని చెందిన రామ్ వీరపనేనిని జనవరిలో పెళ్లాడారు సునీత. అప్పటి నుంచి మరింత బిజీగా మారిపోయారు ఈ సింగర్. ఒక వైపు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూనే మరోవైపు ఇటీవల బిజినెస్ రంగంలోకి అడుగెట్టారు సునీత.
 
తన అద్భుత గాత్రంతో ఎన్నో వేల పాటలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా మెలోడీలు పాడటంలో దిట్ట అయిన సునీత.. మెలోడీ క్వీన్‌గా బిరుదును సంపాదించుకున్నారు.
 
మరోవైపు యాంకర్‌గా, జడ్జిగా బుల్లితెరపై మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సింగర్‌కి చిన్నప్పుడు సరిగమలు చెప్పిన గురువు తాజాగా కన్నుమూశారు. దీంతో ఈ సింగర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు చిన్ననాటి గురువును గుర్తు చేసుకుంటూ సునీత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
 
''శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారు . చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు. స్వర్గస్థులయ్యారు. చాలా బాధగా ఉంది. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే'' అని సునీత ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇక సునీత పోస్ట్‌కి స్పందిస్తోన్న నెటిజన్లు..ఆయన ఆత్మకు శాంతి కలగాలని కామెంట్లు పెడుతున్నారు.