బృహస్పతిని గురువారం పూజిస్తే..?
వారంలో ఏడు రోజుల్లో గురువారం బృహస్పతి అనబడే గురు భగవానుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. గురువును గురువారం పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే గురువారం పూట పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దేవతల గురువైన బృహస్పతిని గురువారం పూట స్తుతిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
అలాంటి గురుభగవానుడికి ముల్ల పువ్వులు అంటే ఇష్టం. శెనగల మాలంటే ఆయనకు ప్రీతి. ఏనుగును వాహనంగా కలిగివుండే బృహస్పతికి గురువారం పూట నేతి దీపంతో వెలిగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.
గురువుకు పుష్యరాగం అంటే మహా ఇష్టం. ఆయన ఆధిక్య సంఖ్య 3, గురువు అధిదేవత శ్రీ బ్రహ్మ. గురుభుక్తి కారకుడైన ఆయనను ప్రార్థించడం ద్వారా బుద్ధికుశలత, బుద్ధి వికాసం చేకూరుతుంది. అలాగే గురు గాయత్రీ మంత్రంతో 108 సార్లు పఠించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి.