ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టే పుదీనా ఆకులు!
ఇన్ఫెక్షన్లకు పుదీనా ఆకులతో చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దోమలు కుట్టడం వల్ల, ఇతర కారణాల వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్లను పుదీనా ఆకుల రసం దూరం చేస్తుంది. స్కిన్ ఇరిటేషన్ అవుతుంటే శరీరానికి పుదీనా ఆకులను ఉపయోగించండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇరిటేషన్ తగ్గిస్తుంది. అంతే కాదు, చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది.
అలాగే మీ తలలో ఉండే ఇన్ఫెక్షన్లకు కూడా పుదీనా క్లీన్ అండ్ క్లియర్ చేస్తుంది. మింట్ ఆయిల్‌తో తలను రెండు మూడు సార్లు మసాజ్ చేస్తే ఇన్ఫెక్షన్, చుండ్రు వంటి సమస్యలు దూరమవుతాయి. చాలా వరకూ మహిళలు మొటిమలతో వచ్చే నల్ల మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు.
అటువంటి వారిలో మీరు కూడా ఇక్కరైతే మీరు పుదీనా ఉపయోగించి డార్క్ మార్క్స్‌ను తగ్గించుకోవచ్చు. పుదీనా రసంలో ఓట్స్ పౌడర్‌ను మిక్స్ చేసి మీ చర్మానికి అప్లై చేయాలి. ఇది డార్క్ మార్స్క్‌ను తొలగించడం మాత్రమే కాదు, ఇది డెడ్ స్కిన్ లెవల్స్‌ను కూడా తగ్గిస్తుంది. స్కార్స్ తొలగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
పుదీనా పాదాల పగుళ్లను కూడా నివారిస్తుంది. ఎవరైతే పాదాల పగుళ్ళతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు, పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిలో పాదాలను కొద్ది సమయం నానబెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మీ పాదాలు కోమలంగా, మృదువుగా తయారవుతాయి.
