1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. Benefits Of Corn Flakes During Pregnancy

గర్భిణీ మహిళలు కార్న్ ఫ్లేక్స్ తినొచ్చా?

pregnent woman
గర్భిణీ మహిళలు కార్న్ ఫ్లేక్స్ తినొచ్చా? అనే డౌట్ మీలో ఉందా? అయితే ఈ కథనం చదవండి. గర్భిణీ మహిళలు రోజూ ఆరు సార్లు కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవాలి. తద్వారా ఎనర్జీ లెవెల్స్ అధికం అవుతాయి. అయితే కార్న్ ఫ్లేక్స్ తీసుకోవడం వల్ల గర్భిణీ మహిళలకు మేలేనని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇది బ్లడ్, షుగర్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. 
 
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం గర్భిణీ స్త్రీల డైట్ లో అధికంగా డైటరీ ఫైబర్ ఉంటే కడుపులో శిశువు పెరుగుదల మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కార్న్ ఫ్లేక్స్ లో అధికంగా ఫైబర్ ఉండటం చేత గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఆరోగ్యకరం అంటున్నారు. 
 
కార్న్ ఫ్లేక్స్ గర్భిణీ స్త్రీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే. 
 
ఒక కప్పు కార్న్ ఫ్లేక్స్ వల్ల 25గ్రాముల ఒక రోజుకు సరిపేడే ఫైబర్ పొందవచ్చు. మీ రెగ్యులర్ డైట్‌లో అధిక ఫైబర్ తీసుకొన్నప్పుడు, బ్లడ్ ప్రెజర్‌ తగ్గిపోతుంది. గర్భిణీలకు కార్న్ ఫ్లేక్స్ వల్ల ఎక్కువ డైటరీ ఫైబర్‌ను పొందవచ్చు.
 
గర్భధారణ సమయంలో కార్న్ ఫ్లేక్స్ వల్ల మరో ప్రయోజనం కడుపులో పెరిగే శిశువు వల్ల ఏర్పడే బ్లడ్ ప్రెజర్ శిశువు ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం పడకుండా రక్షణ కల్పిస్తుంది. చివరగా, కార్న్ ఫ్లేక్స్ గర్భిణీల రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బాడీ వెయిట్‌ను మెయింటైన్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. 
 
కడుపులో పెరిగే శిశువు వల్ల తల్లిలో వచ్చే బరువు మార్పలను స్థిరంగా ఉంచుతుంది. కార్న్ ఫ్లేక్స్‌ను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల అధికంగా డైటరీ ఫైబర్ ఉండటం వల్ల మీ పొట్టను ఫుల్‌గా ఉంచుతుంది. 
About Writer
Selvi