మంచి కోడలు అనిపించుకోవాలంటే.. తల్లిలాగే?
మంచి కోడలు అనిపించుకోవాలంటే.. మానవత్వానికి తప్పకుండా విలువ ఇవ్వాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు. కొందరైతే ఆధునికత పేరుతో అత్తమామలను వదిలి ఉద్యోగరీత్యా విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు. దీంతో పెంచి పెద్ద చేసిన పిల్లలు వృద్ధాప్యంలో చేయూత ఇవ్వడం కరువవుతుంది. మరికొందరైతే పక్కనే ఉన్నా అత్తమామలపై ద్వేషం పెంచుకోవడం.. వారికి దూరంగా ఉండటం వంటివి చేస్తుంటారు. అలాంటి వారు మీరైతే ఈ కథనం చదివాక తప్పకుండా మారుతారు.
మంచి కోడలుగా మార్కులు కొట్టేయాలంటే.. తల్లిలాగే అత్తను కూడా సమానంగా చూసుకోవాలి. ఉదాహరణకు అమ్మకు బర్త్ డే గిఫ్ట్ కొనిచ్చినప్పుడు, అత్తగారి పుట్టిన రోజుకు కూడా బహుమతిని అందివ్వండి.
సహజంగా మహిళలు వారి జీవితంలో చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ముఖ్యంగా మహిళ అత్తపాత్రను పోషించినప్పుడు తన కొడుకు ఎప్పుడూ తను చెప్పినట్లే తనకు మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండాలని కోరుకుంటుంది.
అందువల్ల చాలా మంది అత్తలు కోడలిని తనకు పోటీగా భావించినప్పుడూ.. పరిస్థితిని విడమరిచి చెప్పండి. అత్తగారికి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. అత్తగారిని వయస్సైనదానిగా లేదా వైజర్స్‌గా పరిగణించకూడదు. ఆమె జీవితంలో ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఉండవచ్చు.
నిజానికి, కోడలు ఆమెతో మాట్లాడటం ఆమె చిన్నతం గురించి, పెరుగుదల, పిల్లల, వారి పెరుగుదల , జీవితాననుభావాల గురించి అడిగి తెలుసుకోవాలి. ఆమె ఎప్పుడైతే ఆమె జీవితాన్ని మీతో పంచుకుంటుందో, అప్పుడు మీరంటే ఆమెకు ఇష్టం కలుగుతుంది. అది మీ ఇద్దరి మద్య సంబంధాన్ని మరింత బలపడేలా చేస్తుందని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
