1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. Coriander leaves health benefits

నెలసరి ఇబ్బందులను తొలగించే కొత్తిమీర

Coriander leaves
కూరల్లో చక్కని సువాసన, మంచి రుచిని ఇవ్వడం కొత్తిమీర సొంతం. అయితే కొత్తిమీర రుచిలోనే కాదు, ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా అద్బతంగా సహాయపడుతుంది. దీనిని తరచూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అదెలాగో చూద్దాం.
 
1. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. ఇందులో మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్‌లు తగిన మోతాదులో లభిస్తాయి.
 
2. దీనిలో విటమిన్ సి, కె లతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
 
3. మధుమేహంతో బాధపడేవారికి ఇది చక్కని ఔషధంలా పని చేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమన్వయపరుస్తుంది. 
 
4. దీనిలో లభించే విటమిన్ కె వయసు మళ్లిన తరువాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలకంగా పని చేస్తుంది. అంతేకాకుండా కొవ్వును కరిగించే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా లభిస్తాయి.
 
5. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. 
 
6. కొత్తిమీరలోని యాంటీసెప్టిక్ లక్షణాలు నోటిపూతను తగ్గిస్తాయి. అంతేకాకుండా మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను తగ్గిస్తాయి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
కరోనా వైరస్ కన్నీటి ద్వారా వ్యాపిస్తుందా?