1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. Effects of sitting in front of the computer for too long

గంటలపాటు కంప్యూటర్ ముందు కూర్చుంటే వృద్ధాప్య ఛాయలు తప్పవట!!

Effects
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుంటున్నారా..? అయితే త్వరలోనే వృద్ధాప్య ఛాయలు తప్పవంటున్నారు పరిశోధకులు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యంతో ఫాస్ట్ ట్రెండ్‌లో అన్ని రంగాల్లో కంప్యూటర్ వినియోగం తప్పనిసరి అయ్యింది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే వారు ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు అలానే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటే త్వరలోనే వృద్ధాప్య ఛాయలు అలముకుంటాయని తాజా సర్వే తేల్చింది. ముఖ్యంగా మహిళల్లో త్వరలో వృద్ధాప్య ఛాయలు ఏర్పడే లక్షణాలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.  
 
ఇంగ్లండ్‌కు చెందిన వైద్య బృందం నిర్వహించిన ఈ సర్వేలో ఐటీ కంపెనీల్లో పనిచేసే అత్యధిక మహిళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇంకా కంప్యూటర్ల ముందు మహిళలు పూర్తి శ్రద్ధతో పనిచేయడం ద్వారా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తద్వారా వృద్ధాప్య ఛాయలు 25, 30 ఏళ్లల్లోనే వచ్చేస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  
 
మానసిక ఒత్తిడితో చర్మం ముడతలు పడిపోతోందని, కంటి కిందటి వలయాలు ఏర్పడటం వంటివి ముఖంలో ఉత్తేజం లేకుండా చేస్తాయి. తద్వారా మెల్ల మెల్లగా మెచ్యూర్డ్ అయినట్లు కనిపించేస్తున్నారని పరిశోధకులు అంటున్నారు.