1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. కథనాలు
  6. Brush

Teeth | Brush | Dentist | Clean | Smell | Water | తళతళ మెరిసే పళ్లకోసం...

పళ్లు
FILE
చక్కటి పళ్లవరస చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. తనవితీరా నవ్వాలంటే హాస్యం ఒక్కటే సరిపోదు చూడచక్కటి దంతసిరి కూడా ఉండాలి. మరి అలాంటి పళ్లు మీ సొంతం కావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

చాలామంది అందంగా ఉండడానికి ముఖం తెల్లగా ఉంటే చాలు లోపలున్న పళ్లను ఎవరుచూస్తారని అనుకుంటారు. ఫలితంగా చిన్న వయసులోనే పళ్లని కోల్పోయి కట్టుడుపళ్లును కట్టించుకుంటున్నారు. దీంతో ఎన్నోరకాల ఆహార పదార్థాలను తినడానికి ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే....

* పళ్ళను రోజుకి రెండు సార్లు శుభ్రం చేసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటు భోజనం చేసిన తర్వాత నోటి నిండా నీటిని పుక్కిటపట్టి పళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయని పక్షంలో.. మీరు తీసుకున్న ఆహారం పళ్ల మధ్య ఇరుక్కుపోయి చాలా హాని కలిగిస్తుంది. అలా ఇరుక్కుపోయిన ఆహారంలో బ్యాక్టీరియా చేరుతుంది. అలాగే తీపి వస్తువులు తిన్న తర్వాత కూడా నోటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే తిన్న కాసేపటికే నోరంతా దుర్వాసన వస్తుంది. త్వరగా పళ్లు పాడవడానికి ఇదొక కారణం.

* బ్రష్ చేయడంలో చాలామంది చేసే పొరపాటేమిటంటే.... ముందరి పళ్లనే బాగా తోముతారు. లోపలి భాగాన్ని అంతగా పట్టించుకోరు. అలాకాకుండా పళ్లను మూడు వైపుల నుంచి తోమాలి.

* కొంతమంది బ్రష్‌ని గట్టిగా పట్టుకుని పళ్లపై గట్టిగా రుద్దుతారు. దీని వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. పళ్లపై నున్న ఎనామిల్ పొర కూడా త్వరగా పోతుంది. అందుకే బ్రష్‌తో పళ్లపై ఒకటికి రెండుసార్లు సున్నితంగా తోమండి.

* మీరు వాడే బ్రష్‌ని మూడు నెలలకొకసారి తప్పనిసరిగా మార్చండి. కొన్ని టూత్ బ్రష్‌లు కొన్న కొన్ని రోజులకే బ్రిసిల్స్ రంగు మారిపోతాయి. అలాంటప్పుడు వాటిని వెంటనే మార్చేయండి.

* సంవత్సరానికొకసారైనా దంతవైద్యున్ని సంప్రదించండి. పళ్లను పరీక్ష చేయించుకున్ అవసరమైతే క్లీన్ చేయించుకోండి.

పై జాగ్రత్తలతో పాటు తాజా పండ్లు, కాయకూరలు క్రమం తప్పకుండా తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. బాగా చల్లటి నీళ్లను, ఎక్కువ తీపి వున్న పదార్థాలను తీసుకోవడం తగ్గించండి.