శ్రీ శోభకృత్ నామ సం॥ ఆశ్వీయుజ శు॥ తదియ రా.11.55 విశాఖ రా.8.12 రా.వ.12.14 ల 1.51. ఉ. దు. 8.16 ల 9.04 రా.దు. 10.37 ల 11.26.
కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు నెరవేరుతాయి.
మేషం :- మీ మాటకు సంఘంలోను, కుటుంబంలోను గౌరవం లభిస్తుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. విద్యార్థినుల్లో ఉత్సాహం నెలకొంటుంది. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి.