గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-10-2023 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...

Makara rashi
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ విదియ రా.11.57 స్వాతి రా.7.31 రా.వ.1.17 ల 2.55. ప.దు.12.14 ల 1.02 పు.దు. 2.37 ల 3.25.
ఉమాపతిని ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- ఆదాయ వ్యయాలు సరిసమానం. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. క్రీడ, కళ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పెద్దల మాటను శిరసా వహిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పురోభివృద్ధి కానవస్తుంది.
 
వృషభం :- వివాహ యత్నాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. తలపెట్టిన పనులు ఆశించిన చరుకుగా సాగవు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా అవసరాలు నెవవేరుతాయి.
 
మిథునం :- కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపందాల్చుతుంది. ఉద్యోగం ప్రమోషన్, ఇంక్రిమెంటు వంటి శుభవార్తలు అందుతాయి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. 
 
కర్కాటకం :- బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు అధికారులనుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాలలో అయినవారిని అవమానించడం వల్ల ఆందోళనకు లోనవుతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
 
సింహం :- ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోవడానికి ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. వస్త్ర, పచారీ, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి.
 
కన్య :- వస్త్ర, బంగారు, వెండి రంగాలలో వారికి కలిసిరాగలదు. సినిమా, కళాంకారీ రంగాలలో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. మీరంటే కిట్టని వారు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ధనార్జన, ఆస్తుల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తారు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల :- పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. మీ యత్నాలకు మంచిసలహా, సహాకారం మిత్రుల వల్ల లభిస్తుంది. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బంధువుల రాకపోకలు సంతోషాన్ని కలిగిస్తాయి.
 
వృశ్చికం :- దైవ సందర్శనాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొన వలసివస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది.
 
ధనస్సు :- ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకావాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది.
 
మకరం :- ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. సోదరీ, సోదరులు, బంధువుల మధ్య బాంధవ్యాలు మరింత బలపడతాయి. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కుంభం :- మానవత్వంతో సాగడం మీకు ఎంతోమంచిది. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. కుటుంబములలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం సందడి చోటుచేసుకుంటాయి. సినిమా, కళాంకారీ రంగాలలో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి.
 
మీనం :- ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నాం నెరవేరగలదు.