సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-10-2023 బుధవారం రాశిఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...

tula rashi
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద ఐ|| త్రయోదశి రా.7.13 పుబ్బ ప.12.12 రా.వ.8.07ల 9.52. ఉ. దు. 9.50 ల 10. 38 ప.దు. 2.35 ల 3.22.
దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- పెద్దల ఆహార, ఆరోగ్య విషయాలలో మెళకువ అవసరం. మనుష్యుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. బ్యాంకుల్లో హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
 
వృషభం :- పట్టువిడుపు ధోరణితో సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామిక వేత్తలకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసివస్తుంది. స్త్రీలు ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. రేపటి గురించి అధికంగా ఆలోచిస్తారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాలలో వారికి అనుకూలమైన కాలం.
 
మిథునం :-వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తనం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో పోటీ, పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకుంటారు. రుణం తీర్చటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తుల వారికి గుర్తింపు, ఆదాయాభివృద్ధి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు.
 
సింహం :- ఏ పనిముందుకు సాగక విసుగు చెందుతారు. షాపు గుమస్తాలు, పనివారలకు ఆదాయాభివృద్ధి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తప్పవు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీతో సఖ్యతగా నటించి తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశంలభిస్తుంది. 
 
కన్య :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీపనులు సానుకూలమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. సొంతవ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు. చేతివృత్తులవారికి శ్రమాధిక్యత మినహాలభించిన ప్రతిఫలం సంతృప్తికరం. రాజకీయ నాయకులు తరచు సభ సమావేశాలలో పాల్గొంటారు.
 
తుల :- గత తప్పిదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్త వహించండి. దాన ధర్మాలు చేయడంవల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కొన్ని అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ముఖ్యంగా మీ తాహతుకు మించి ఖర్చు చేయకండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం :- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
ధనస్సు :- వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం ఉంటుంది. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రైవేటు, పత్రికా రంగంలోని వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ అభిరుచికితగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
మకరం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయుల పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. విద్యార్థినులు, విద్యార్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలుసంతృప్తి కరంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఊహించని ప్రయాణాలు సంభవిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. స్త్రీలకు ధనార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.