సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-10-2023 శనివారం రాశిఫలాలు - శనీశ్వరునికి తైలాభిషేకం చేయించిన శుభదాయకం...

Rishabham
మేషం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు మంజూరు కాగలవు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి.
 
కర్కాటకం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పనులు మందకొడిగా సాగుతాయి.
 
సింహం :- అనుకున్న పనులు కాస్త ఆలస్యమైనా కంగారు పడకండి. స్త్రీలు దైవ దర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
కన్య :- మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఎదుటివారి తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు.
 
తుల :- ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత అవసరం. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అసవరం. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం.
 
ధనస్సు :- రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దైవ దర్శనాలు, దీక్షలుపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పున ప్రారభమవుతాయి. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవహరాల్లో అపరిచితవ్యక్తులపట్ల మెలకువ వహించండి.
 
మకరం :- చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి.
 
కుంభం :- పెద్దమొత్తం నగదు సాయం క్షేమం కాదు. ఆత్మీయుల సలహా పాటించండి. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీడియా రంగాల వారికి పనిభారం అధికం. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి.
 
మీనం :- వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కొత్త ఆదాయమార్గాల అన్వేషణ ఫలిస్తుంది. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి.