మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:20 IST)

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి భాస్కర్ రావు మృతి

high court
ఏపీ ఉమ్మిడి హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ భాస్కర రావు సోమవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మహాప్రస్థానంలో జరుగనున్నాయి. నల్గొండ జిల్లాలో 1937లో జస్టిస్ భాస్కర్ రావు జన్మించారు. 1995లో తొలిసారి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1999లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 
 
86 యేళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. జస్టిస్ భాస్కర్ రావు స్వస్థతలం నల్గొండ జిల్లా చంతపల్లి మండలం ఘడియ గౌరారం. హైదరాబాద్ ఉప్పల్ ఈస్ట్ కళ్యాణపురిలో నివాసం ఉంటున్నారు. గత 1937లో జన్మించిన జస్టిస్ భాస్కర రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచిఎస్సీ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 
 
1963లో న్యాయవాదిగా తన ప్రయాణం ప్రారంబించారు. 1981సో జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1995లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగాను బాధ్యతలు నిర్వహించారు. ఈయనకు భార్య లలితాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు మంగళవారం పూర్తి చేయనున్నారు.