సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (13:25 IST)

అమరావతి అసైన్డ్ భూముల కేసు రీఓపెన్ - విచారణ వాయిదా

అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కేసును ఏపీ ప్రభుత్వం తిరిగి రీఓపెన్ చేసింది. ఈ కేసులో కొత్తగా పలువురి పేర్లు చేర్చామని, అలాగే, కొత్త ఆధారాలు సేకరించామని అందువల్ల ఈ కేసును తిరిగి విచారించారించాలని కోరుతూ ఏపీ సీఐడీ పోలీసులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సీఐడీ ఇచ్చిన కొత్త ఆధారాలన ఉన్నత న్యాయస్థానం పరిశీలించి, కేసు రీఓపెన్‌కు అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్‌ వేయాలని హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ సందర్భంగా సీఐడీ తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి కొన్ని ఆడియో ఫైల్స్‌ను అందించారు. మంగళవారం కూడా మరికొన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని సీఐడీ తెలిపింది. అనంతరం విచారణను వచ్చే నవంబర్‌ 1కి హైకోర్టు వాయిదా వేసింది. 
 
కాగా, అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. అయితే ఈ కేసులో మరో నలుగురి పేర్లను కొత్తగా చేర్చామని, రీఓపెన్‌ చేయాలని ఇటీవల సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి నారాయణ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఇపుడు కేసు మళ్లీ రీఓపెన్ చేయడంతో మాజీ మంత్రి నారాయణ కేసులో హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సివుంది.