Astrology Zodiac Saggitarius Fin.htm

Notifications

ధనస్సు ధనస్సు
ఆర్థిక స్థితి

చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతుండటంవల్ల ఆర్ధికస్థితి మెరుగ్గా ఉంటుంది. మొదటినుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతుంటారు. తద్వారా లాభాలు బాగానే వస్తాయి.

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహంమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు క్రియారూపం దాలుస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోండి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక పత్రాలు అందుకుంటారు.