సంబంధిత వార్తలు
- పేమెంట్ గేట్ వే నుంచి క్షణాల్లో రూ.1.25 కోట్ల హాంఫట్.. ఎలా?
- మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్ధితులలోను అది మానేయకూడదు
- 4వేల మెగావాట్ల పీవీ మాడ్యుల్ తయారీ కోసం ఐఆర్ఈడీఏ బిడ్ గెలుచుకున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్
- హైదరాబాద్‌లో మరో ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై నీచం
- గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు.. ఎవరు..?
పండగ రోజున కొడుకు ఇంటికి రాలేదని తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో కొడుకుపై అమితమైన ప్రేమను పెట్టుకున్న ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. పండగ రోజున తన బిడ్డ ఇంటికి రాకపోవడంతో కలత చెందిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని మోడల్ కాలనీలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మోడల్ కాలనీకి చెందిన దండ బుచ్చిబాబు, సుజాత(53) కుమారుడు యోగకు గత ఆగస్టులో వివాహమైంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన కుమారుడు, కోడలు విశాఖపట్నంలో స్థిరపడ్డారు.
దీపావళి పండగ నాటికి ఇంటికి రావాలని సుజాత కుమారుడిని కోరింది. కానీ, సెలవు లేకపోవడంతో వారు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అప్పట్నుంచి ముభావంగా ఉంటోంది.
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున భర్త పెంట్‌హౌస్‌లో నిద్రపోగా సుజాత కింది అంతస్తులో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
