భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది.. గాంధీజీ వల్ల కాదు.. నేతాజీ వల్లే : క్లామెంటీ అట్లీ
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. మహాత్మా గాంధీ వల్ల కాదనీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లేనని అప్రటి బ్రిటన్ ప్రధాని క్లామెంటీ అట్లీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. త్వరలో ప్రచురితం కానున్న "బోస్: యాన్ ఇండియన్ సామురాయ్" పుస్తకంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం ఉన్నట్టు సమాచారం.
బ్రిటన్ ప్రధానిపై గాంధీ అహింసా ఉద్యమం నామమాత్రపు ప్రభావాన్నే చూపిందని, నేతాజీ మొదలు పెట్టిన ఆజాద్ హింద్ ఫౌజ్ మాత్రం వారిని భయపెట్టిందని పుస్తకాన్ని రచిస్తున్న సైనిక చరిత్రకారుడు జనరల్ జీడీ బక్షి వెల్లడించారు. స్వాతంత్ర్యానంతరం 9 ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌కు వచ్చిన అట్లీ, జస్టిస్ పీబీ చక్రవర్తి ఇంట బస చేశారని చెబుతూ ఆ సమయంలో వారి మాటలను పుస్తకంలో వివరించినట్టు పేర్కొన్నారు.
ఆ సమయంలో ఇండియాను వదిలి ఎందుకు వెళ్లారన్న చక్రవర్తి ప్రశ్నపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత పరిస్థితి మారుతోందని తాము గమనించామని, ఆపై నేతాజీ సైనిక కార్యకలాపాలు చూసి ఇండియాకు స్వాతంత్ర్యం ప్రకటించాలని నిర్ణయించామని ఆయన వెల్లడించినట్టు పేర్కొన్నారు.
