సంబంధిత వార్తలు
- భాగ్యనగరిలో ముంచెత్తిన వర్షం - రోడ్లపై భారీగా నీరు.. స్తంభించిన ట్రాఫిక్
- రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రెట్టింపు
- అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల ప్రారంభించిన కళామందిర్ రాయల్ షోరూమ్
- గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
- అందరినీ అలరించేలా తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర - కృష్ణ, బ్రహ్మానందం
హైదరాబాదులో ఈ బిర్యానీ గొడవేంట్రా బాబూ...!
హైదరాబాదులో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్ సీపీని కలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకు హోటల్ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగాడు. దీంతో మహమూద్ అలీ స్పందిస్తూ తాను హోం మంత్రినని.. వంద టెన్షన్లలలో ఈ ఫోనేంటని అసహనం వ్యక్తం చేశారు.
