గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (21:30 IST)

చిక్కుల్లో బాలకృష్ణ.. పోలీసు కేసు పెట్టిన హిజ్రాలు.. ఎందుకో తెలుసా?

Nandamuri Balakrishna
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. ఒకవైపు నటుడిగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
తాజాగా బాలకృష్ణపై కేసు నమోదు చేశారు హిజ్రాలు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ హిందూపురంలో కనిపించడం లేదంటూ హిందూపురం నియోజకవర్గం హిజ్రాలు ఈయనపై కేసు నమోదు చేయడం చర్చలకు దారితీస్తుంది.
 
ఇలా హిజ్రాలు ఎమ్మెల్యే కనపడటం లేదంటూ చేసిన ఫిర్యాదు పట్ల నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోని వాటికి పరిష్కారం చేయాలంటూ హిజ్రాలు ఫిర్యాదులో తెలిపారు. 
 
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు స్థానికంగా నివసించడం లేదు. అయితే పనిగట్టుకొని మరి బాలకృష్ణ మీద మాత్రమే ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడం వెనుక ఇతరుల ప్రమేయం ఉందని అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.