శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (21:51 IST)

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్

Rains
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీట మునిగిపోయాయి. 
 
కుండపోత వర్షంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లే టైమ్ కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
బంజారాహిల్స్, లక్డికపూల్, అసెంబ్లీ, సచివాలయం, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.