శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (12:30 IST)

పవన్‌ను తిట్టు తప్పులేదు.. భార్యపిల్లల గురించి మాట్లాడితే తాటతీస్తా

Srireddy
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. మొదటిసారి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచింది.. పవన్ పై వ్యతిరేకంగా మాట్లాడిన అనిల్ రెడ్డిని బూతులతో కడిగిపారేసింది. వైసీపీ మద్దతుదారుడిగా వున్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. 
 
పవన్ భార్య, పిల్లలను తనకు అప్పగించాలని అనిల్ నోరు పారేసుకున్నారు. ఈ వీడియో పై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించింది. వైసీపీ ఉన్న అభిమానంతో మనమంతా జగనన్నను నమ్మిన వాళ్లము. ఒక వెధవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం గురించి తప్పుగా మాట్లాడాడు. 
 
పవన్‌ను తిట్టు తప్పులేదు. కానీ ఆయన భార్య పిల్లలను అనిల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల జోలికి వస్తే తాటతీస్తానంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. అనిల్ లాంటి రౌడీ వెధవలను జగనన్న ఎంకరేజ్ చేయడం సరికాదని.. అనిల్ గురించి జగనన్నకు సమాచారం చేరవేయాలని శ్రీరెడ్డి చెప్పింది.