గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (21:32 IST)

బాలయ్య షోలో పవన్... ఆ షో ప్రసారం ఎప్పుడంటే..?

balakrishna _Pawan
balakrishna _Pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించే 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బికె' టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షో ఎప్పుడు ప్రసారం అవుతుందా అని పీకే ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ - బాలయ్య షోకు చెందిన ఎపిసోడ్ ఫిబ్రవరి 3,10 తేదీలలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుంది. ఈ షోలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలు, కెరీర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడి అవుతాయని తెలుస్తోంది.  
 
లేటెస్ట్ హిట్ 'వీరసింహా రెడ్డి' విజయాన్ని అందుకున్న బాలయ్య, సినీ పరిశ్రమలో పవన్ ప్రయాణం గురించిన చాలా ప్రశ్నలకు ఈ షో ద్వారా సమాధానమిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా మొదటిసారిగా, 'పవర్ స్టార్' తన వ్యక్తిగత జీవితం గురించి, తన మూడు వివాహాల గురించి ఈ షోలో ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.