1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Varun Tej's Valmiki Trailer released

గద్దలకొండ గణేష్ అంటే గజగజ వణికిపోవాల... వామ్మో 'వాల్మీకి'(Video)

Valmiki Trailer
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్లో వరుణ్ తేజ్ లుక్ మామూలుగా లేదు. అదిరిపోయింది. ఎఫ్ 2లో ఫన్నీ క్యారెక్టర్ చేసిన వరుణ్ తేజ్ ఈ చిత్రంలో విలన్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు. కాగా ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్. సెప్టెంబరు 20న విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. గద్దలకొండ గణేష్ అంటే గజగజ వణికిపోవాల అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్... ఏంట్రో సతాయిస్తున్నవ్ అంటూ తెలంగాణ యాస అతికినట్లుగా వుంది. చూడండి ట్రైలర్... 
తర్వాతి కథనం
భారీ యాక్షన్ మూవీగా గోపీచంద్ 'చాణక్య' (Teaser)