శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (11:13 IST)

వాల్మీకి ‘జర్ర జర్ర’ సాంగ్ అదిరిందిగా..? (video)

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తమిళ హీరో అథర్వ మురళి, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి, సూపర్ సక్సెస్ సాధించిన జిగర్తాండ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వాల్మీకి.


మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకులు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. 
 
ఇకపోతే నేడు ఈ సినిమా నుండి ‘జర్ర జర్ర’ అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మిక్కీ జె మేయర్ సంగీత సారథ్యంలో వరుణ్ తేజ్, అథర్వ, డింపుల్ హయతిల కాంబినేషన్లో చిత్రీకరించిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, ఉమా నేహా ఎంతో ఉల్లాసంగా ఆలపించారు. సినిమాలో హీరో క్యారెక్టరైజెషన్‌ని తెలిపే విధంగా, మాంచి మాసి గా సాగె ఈ సాంగ్ ను రాసింది, ప్రముఖ సాహితి వేత్త భాస్కరభట్ల. 
 
ఇక ఈ సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే, రేపు సినిమా రిలీజ్ తరువాత ఈ సాంగ్ వచ్చే సమయంలో ప్రేక్షకులు ఉత్సాహంతో చిందులేయడం ఖాయంగా కనపడుతోంది. ఈ సాంగ్ పూర్తి వీడియోని రేపు రిలీజ్ చేయనున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 13న రిలీజ్ చేయనున్నారు.