శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (16:24 IST)

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన షకీబ్... మళ్లీ ఆ రికార్డు ఎవరికో తెలుసా?

శ్రీలంకతో లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల పంట పండించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 93 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. దీంతో రోహిత్ శర్మ ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు.
 
అలాగే ఓ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. 2015 ప్రపంచకప్‌‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు సాధించాడు.
 
అంతేగాకుండా.. ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇదే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్ (586) రికార్డుని బంగ్లా క్రికెటర్ షకీబ్ ఉల్‌ హాసన్ (606) అధిగమించాడు. 
 
తాజాగా శ్రీలంక మ్యాచ్‌లో రోహిత్‌ షకీబ్ రికార్డును రోహిత్ శర్మ బద్ధలు కొట్టాడు. అంతేకాదు ప్రపంచకప్‌లో 600పైకి పైగా పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా మరో ఘనత కూడా సాధించాడు. ఇలా లంకేయులతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ హీరో అయ్యాడు.