రెండు జడలు - లంగావోణీలో జిగేల్ రాణి... "వాల్మీకి" టైటిల్‌పై గగ్గోలు
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం "వాల్మీకి". హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే పాటు అథర్వ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విడుదలకానీ, దానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
తాజాగా ఈ మూవీ నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పూజాహెగ్డే లంగావోణిలో సైకిల్‌పై వెళ్తున్న ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు జడలతో పల్లెటూరి పక్కా అమ్మాయిగా కనిపిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేస్తోంది పూజాహెగ్డే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగర్తాండ'కి రీమేక్‌గా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుంది.
మరోవైపు, ఈ చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయ వాల్మీకీల మనోభావాలు దెబ్బ తినే విధంగా చిత్ర ట్రైలర్ ద్వారా తెలుస్తుందని, వెంటనే సినిమా పేరు మార్చాలని, తమ హక్కులను కించ పరిచే విధంగా తీసిన ఈ సినిమా యూనిట్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని బోయ హక్కుల సమితి హెకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది త్వరలోనే విచారణకు రానుంది.