ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించింది. ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనికాల వ్యాక్సిన్‌తో పాటు, భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాలను అత్యవసర వినియోగం నిమిత్తం వాడవచ్చని నియంత్రణా సంఘాలు అనుమతించాయి. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇంకా మూడవ దశ పరీక్షల ఫలితాలను వెల్లడించనందున ప్రస్తుతానికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ టీకానే పంపిణీ చేయనున్నారు. ...