సంబంధిత వార్తలు
- మేము 'I.N.D.I.A.'అంటే దేశం పేరు భారత్.. మరి భారత్ అంటే.?- కేజ్రీవాల్
- కత్రినా కైఫ్‌కు నేనెందుకు ఎట్ట్రాక్ట్ అయ్యానో తెలిపిన విక్కీ కౌశల్
- సెప్టెంబర్ 29న భారత మార్కెట్లోకి Aston Martin DB12
- దేశం పేరు ఇండియా నుంచి "భారత్"గా మార్పు?
- ఐసీసీ ప్రపంచ కప్ : భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న క్రికెటర్లు వీరే..
ఎన్నికల నాటకానికి వేషాలు మార్చే విదూషకుడు ఎవరు? ప్రకాశ్ రాజ్
భారత్ పేరు మార్చాలన్న డిమాండ్ గత కొద్ది రోజులుగా దేశంలో కలకలం రేపుతోంది. ఇండియా పేరు స్థానంలో "భారత్" అనే పేరు పెట్టాలని అధికార బీజేపీ భావిస్తోంది.
ఈ విషయంలో జాతీయ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అభిప్రాయ విభేదాలు తలెత్తాయి. అలాగే సెలబ్రిటీలు, క్రీడాకారులు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ దేశం పేరు మార్చడంపై వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై వ్యాఖ్యానిస్తూ, "పోల్ ఇండియా - ఎన్నికల నాటకం కోసం దేశం పేరును మార్చాలనుకుంటున్నారు. ఎన్నికల నాటకానికి వేషాలు మార్చే విదూషకుడు ఎవరు? అంటూ" అని తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
దేశం పేరు మార్చే అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
