సంబంధిత వార్తలు
- RT76 : రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం - 2026 సంక్రాంతికి రిలీజ్
- విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)
- Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్
- Miss World 2025: మిస్ వరల్డ్ 2025 పోటీల గ్రాండ్ ఫినాలే- సోనూసూద్‌కు ప్రత్యేక అవార్డ్
- TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ
Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)
ప్రముఖ నటుడు సోనూ సూద్ జూన్ రెండో తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటిసారిగా 25 ఏండ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానన్నారు.
మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారి ప్రార్థించానని చెప్పారు. నంది పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నామని, అందులో తాను నటిండటంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నానని వెల్లడించారు.
అలాగే సోనూసూద్ తిరుమలలో ఓ చిరు వ్యాపారిని కలిశారు. తిరుమల తిరుగు ప్రయాణంలో సోనూసూద్.. తిరుపతిలో తట్టపైన బేల్ పూరి విక్రయిస్తున్న చిరువ్యాపారి జ్యోతితో ముచ్చటించారు.
కుటుంబ విషయాలు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత 25 సంవత్సరాలుగా భేల్ పూరి విక్రయిస్తున్నానని సోనూ సూద్‌తో జ్యోతి చెప్పారు. ఓ సాధారణ వ్యక్తిలా బేల్ పూరి కొనుగోలు చేసి జ్యోతితో కాసేపు ముచ్చటించిన సోనూ సూద్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
