తిరువణ్ణామలై అరుణాచలక్షేత్ర ప్రదర్శనకు వెళ్లిన సినీ నటి స్నేహ, ఆమె భర్త ప్రసన్న చేసిన పనికి భక్తులు మండిపడుతున్నారు. దీంతో ఆమె వివాదంలోకి చిక్కుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, స్నేహ, ఆమె భర్త ప్రసన్న కుమార్ అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి గిరిప్రదక్షిణ చేశారు. ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొడుతూ కాలినడకన గిరిప్రదక్షిణ చేశారు. అయితే, గిరిప్రదక్షిణ చేసేటపుడు వీరిద్దరూ కాళ్లకు చెప్పులు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను పట్టుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్న సంఘటన నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేటలో చాలా చోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
నందమూరి యువసేన అనే అభిమానుల సంఘం కళ్యాణ్ రామ్ రాకను పురస్కరించుకుని పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.ఈ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో కలిసి ఉన్న కళ్యాణ్ రామ్ ఫోటోలు కనిపించాయి. కళ్యాణ్ రామ్ నారా లోకేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల ఫొటోలు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని ప్రదర్శించారు.
ఈ సంఘటన నందమూరి కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసింది. ఇటీవల లోకేష్ సైతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తన చేతితో పట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీంతో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేదని స్పష్టం అయింది.