గురువారం, 10 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మార్చి 2025 (12:14 IST)

ఐపీఎల్ 2025 : చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ హైలెట్స్

ipl2022
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 
 
గత రెండు మ్యాచ్‌లలో తక్కువ స్కోరుకు ఔటైన ఈ లెఫ్ట్ బ్యాండ్ ఆటగాడు... గౌహతిలో మాత్రం రెచ్చిపోయాడు. కేవలం 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో పది ఫోర్లు, ఐదు భారీ సిక్స్‌లు ఉన్నాయి. నితీశ్ రాణా చేసింది 81 పరుగులే అయినప్పటికీ అందో 70 పరుగులు కేవలం బౌండరీలు, సిక్సర్ల ద్వారా రావడం గమనార్హం. అలాగే, సంజూ శాంసన్ 20, రియాన్ పరాగ్ 37, హెట్మెయర్ 19 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సివుండగా, ఆర్ఆర్ బౌలర్ సందీప్ శర్మ కట్టడి చేయడంతో 13 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆరు పరుగుల తేడాతో చెన్నై జట్టు ఓడిపోయింది.