బుధవారం, 2 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 31 మార్చి 2025 (23:18 IST)

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

Belly Fat
ప్రస్తుత జీవనశైలి సులభంగా బెల్లీ ఫ్యాట్,  ఊబకాయం సమస్యలను తెస్తోంది. అందుకే జీవనశైలిలో కాస్తంత మార్పులు చేసుకుంటూ, తగిన చర్యలు తీసుకుంటే పొట్టకొవ్వుతో పాటు ఊబకాయం సమస్యను కూడా అడ్డుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
అల్పాహారం దాటవేయవద్దు.
ఉదయం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆకలిని నియంత్రించి, కేలరీలను తగ్గించవచ్చు.
ఉదయం ఆహారంలో కోడిగుడ్లు, ఓట్స్, పాలు, పన్నీర్ చేర్చుకోవచ్చు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
జంక్ ఫుడ్, వేయించిన, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మానుకోండి.
ఆహారంలో తక్కువ కేలరీల ఆహారాలను చేర్చండి.
సమయానికి భోజనం చేయండి.
ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు, కేలరీలను తగ్గించవచ్చు.
ఆహారంతో పాటు రోజుకు కనీసం ఒక గంట వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతారు.