శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే
అధిక బరువు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న సమస్య. చాలామంది డైటింగ్ తర్వాత కూడా బరువు తగ్గకుండా బరువు పెరిగిపోతుంటారు. దీనికి కారణం ఈ 10 అలవాట్లు ప్రధాన కారణం అయ్యే అవకాశం వుంది. అవేంటో తెలుసుకుందాము.
స్వీట్ సోడా, డ్రింక్స్ తాగడం వల్ల కొవ్వు స్థాయి పెరిగే అవకాశం వుంది. కనుక వాటికి దూరంగా వుండాలి.
ఒత్తిడిలో చాలా మంది ఎక్కువగా భోజనం తినేలా చేస్తుంది, ఫలితంగా అధిక బరువు జతకూడుతుంది.
కొందరు త్వరత్వరగా భోజనాన్ని తినేస్తుంటారు, దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం వుంది.
తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కూడా శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి.
ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల బరువు పెరుగుతారు.
ఉదయం పూట అల్పాహారం మానేయడం వల్ల లావయ్యే అవకాశం వుంది.
నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారని చెపుతారు.
తరచుగా అల్పాహారం తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు పెరుగుతాయి
సిగరెట్ తాగడం లేదా మద్యం సేవించడం వల్ల బరువు పెరుగుతారు
టీవీ చూస్తూ తినడం వల్ల ఎక్కువ ఆహారం తినే అవకాశం వుంది, ఫలితంగా బరువు పెరుగుతారు.