సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 నవంబరు 2024 (22:28 IST)

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

Over weight
చాలామంది అనుకోకుండా వున్నట్లుండి బరువు పెరిగిపోతారు. దీనికి పలు కారణాలు వుంటాయి. చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలు వంటి మీరు తినే కొన్ని వస్తువుల ఫలితంగా మీరు అనుకోకుండా బరువు పెరగవచ్చు. కానీ కొన్నిసార్లు అంతర్లీన ఆరోగ్య పరిస్థితి కారణంగా బరువు పెరగవచ్చు. అనుకోకుండా బరువు పెరగడానికి గల ప్రధానమైన 8 కారణాలు ఏమిటో తెలుసుకుందాము.
 
తరచుగా ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఆహారాలను తినడం వల్ల అనుకోకుండా బరువు పెరుగుతారు.
చాక్లెట్, కేకులు, ఐస్ క్రీమ్‌లు వంటి చక్కెర పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల సమస్య తలెత్తవచ్చు.
డెస్క్ జాబ్‌లో పనిచేయడం, టీవీ చూడటం, డ్రైవింగ్ చేయడం, కంప్యూటర్ లేదా ఫోన్ ఉపయోగించడం అన్నీ కూర్చుని చేసే పనుల వల్ల రావచ్చు.
ఉద్దేశపూర్వకంగా బరువు తగ్గడం వల్ల ఆ తర్వాత అనుకోకుండా బరువును తిరిగి పొందడం వంటివి కూడా జరగవచ్చు.
కొన్ని వైద్య పరిస్థితులు హైపోథైరాయిడిజం డిప్రెషన్, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం కూడా పాత్రను పోషిస్తాయి.
పేలవమైన నిద్ర, అంటే కనీసం 8 గంటల కంటే తక్కువ నిద్ర వల్ల బరువు పెరిగేందుకు కారణం కావచ్చు.
ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఆకలిని పెంచుతాయి, ఫలితంగా ఇది బరువు పెరుగుటకు కారణమవుతుంది.
రోజుకు ఖర్చు చేసే దానికంటే ఎక్కువ కేలరీలను తీసుకుంటే, అధిక బరువు పొందే అవకాశం ఉంది.