దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి
కొన్ని సాధారణ డస్ట్ అలెర్జీ లక్షణాలు తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళు దురద, గొంతు బొంగురుపోవడం, దగ్గు, గురక, శ్వాస ఆడకపోవడం వంటివి కనిపిస్తాయి. ఇదే లక్షణాలు వివిధ రకాల ఇతర అలెర్జీ కారకాల వల్ల కూడా సంభవించవచ్చు. డస్ట్ ఎలర్జీ వున్నవారు చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
డస్ట్ ఎలర్జీతో బాధపడేవారు స్టీమింగ్ పీల్చడం ద్వారా శ్వాసనాళాన్ని క్లియర్ అయి ఉపశమనం లభిస్తుంది.
ఈ ఎలర్జీతో వున్నవారు తేనెను కాస్త గోరువెచ్చటి నీటిలో వేసుకుని తాగితే ఫలితం వుంటుంది.
అల్లం టీ తాగుతుంటే కూడా సమస్య దూరం అవుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ మంటను నివారిస్తుంది, గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు.
అలోవెరా జ్యూస్ తాగడం వల్ల డస్ట్ అలర్జీ అదుపులోకి వస్తుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, నిమ్మ, కివీలను తింటుంటే మేలు కలుగుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.