శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 నవంబరు 2024 (23:51 IST)

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

fruits
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు కనబడుతున్నాయి. ఈ గుండెపోటు సమస్య రాకుండా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
పండ్లు, తాజా కూరగాయలు తినాలి.
మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్‌కి దూరంగా వుండాలి.
ఉదయం వేళ సూర్యకాంతిలో వేగంగా నడిస్తే గుండె కండరాలు బలపడతాయి.
సిగరెట్, చుట్ట, బీడీ స్మోకింగ్ చేయరాదు.
రక్తపోటు, షుగర్ స్థాయిలు కంట్రోల్‌లో వుండేట్లు చూసుకోవాలి.
కనీసం 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.
అధిక బరువు మంచిది కాదు కనుక దాన్ని వదిలించుకోవాలి.
గుండెపోటును అడ్డుకోవాలంటే కుడివైపు పడుకుని నిద్రించాలి.