గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 14 నవంబరు 2024 (23:54 IST)

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

Sesame Balls
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. బెల్లం శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. బెల్లంతో ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బెల్లాన్ని ఎనీమియా రోగులు తింటే రక్త వృద్ధి కలుగుతుంది.
బెల్లం తింటే రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను తొలంగించి చర్మానికి నిగారింపునిస్తుంది.
బెల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, రొంప లాంటి వాటికి ఉపశమనం కలుగుతుంది.
బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డులా చేసుకుని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.
బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అసిడిటీ తగ్గిపోతుంది.