సంబంధిత వార్తలు
- Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)
- అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...
- Telangana: రూ.6లక్షల అప్పుల బాధ.. యాసిడ్ తాగిన చేనేత కార్మికుడు
- 3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...
- ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!
Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..
Ugadi
ఉగాది పండుగ ప్రాముఖ్యత:
ఇది ఆనందం, శ్రేయస్సును సూచించే పండుగ. కొత్త ప్రారంభాలను స్వీకరించడానికి ఒకరి సానుకూలమైన రోజు. అందుకే చాలా మంది ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చేస్తుంటారు.
ఉగాది 2025 తేదీ, సమయం:
2025లో ఉగాది పండుగ మార్చి 30 ఆదివారం నాడు జరుపుకుంటారు.
తిథి మార్చి 29న సాయంత్రం 4.27 గంటలకు ప్రారంభమై మార్చి 30న మధ్యాహ్నం 12.49 గంటలకు ముగుస్తుంది.
ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి:
ఉగాది పండుగ రోజున, తెల్లవారుజామున నిద్రలేచి, అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, పూజ చటేయాలి. తరువాత, ఉగాది పచ్చడితో పాటు వివిధ రకాల వంటకాలను తయారు చేసి జరుపుకుంటారు. ఈ రోజున పంచాంగం చదవడం చాలా శుభప్రదమని, ఇంట్లో సకల సంపదలు పెరుగుతాయని కూడా నమ్ముతారు.
ఉగాది పండుగ బ్రహ్మ ముహూర్త కాలంలో, సూర్యోదయానికి ముందు ఇంట్లోని పూజ గదిలో ఐదు దీపాలను వెలిగించాలి. అలాగే, పసుపు లేదా ఆవు పేడతో గణేశ విగ్రహాన్ని తయారు చేసి, గణేశుడికి గరికతో పాటు నైవేద్యం సమర్పించి పూజించాలి. ఈ విధంగా పూజిస్తే, మీ జీవితంలో సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం.
