బుధవారం, 2 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 31 మార్చి 2025 (19:11 IST)

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

Bike set on fire
తన ప్రియుడు చేసిన మోసానికి ఆ ప్రియురాలు ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటూ కబుర్లు చెప్పిన తన ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుని మోసం చేయడాన్ని సహించలేకపోయింది. ఆగ్రహంతో అతడు కొనుక్కున్న కొత్త బైకుపై పెట్రోల్ పోసి తగులబెట్టి బుగ్గి చేసింది.
 
పూర్తి వివరాలు చూస్తే... విశాఖపట్టణం టూటౌన్ పోలీసు స్టేషను పరిధిలో మూడేళ్ల క్రితం ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు యువకుడు. ఐతే ఏడాది గడిచాక మరో యువతిని పెళ్లి చేసుకుని ప్రియురాలికి షాకిచ్చాడు. దాంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇటీవలే అతడు కొనుక్కున్న బైకుకి నిప్పు పెట్టి తన ఆగ్రహాన్ని తెలిపింది. అతడు బైకుకి నిప్పు పెడితే... దాని పక్కనే వున్న మరో 14 వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులకు సమాచారం అందటంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.