మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఎదుటివారికి మీ సమర్థతపై గురికుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అందుపులో ఉండవు. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. పనులు పురమాయించవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు సాగవు. పెద్దలను సంప్రదిస్తాఆరు. దుబారా ఖర్చులు విపరీతం.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. విందులు, వేడుకకు హాజరవుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పరధ్యానంగా ఉంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనసహాయం తగదు. పనుల్లో ఒత్తిడి అధికం.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యానుకూలతకు నిర్విరామంగా శ్రమిస్తారు. శ్రమించినా ఫలితం ఉండదు. అపజయాలకు కుంగిపోవద్దు. దంపతుల మధ్య ఆకారణ కలహం. బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురికుదురుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాహన సౌఖ్యం పొందుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. స్తోమతకు మించి హమీలివ్వవద్దు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రయాణం తలపెడతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. తలపెట్టిన పనులు చురుకుగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.