సోమవారం, 31 మార్చి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయండి. అనవసర జోక్యం తగదు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి చికాకుపడతారు. ఖర్చులు విపరీతం. పాతమిత్రులను కలుసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాలకు ఖర్చు చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పెద్దల సలహా పాటిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు ప్రయోజనకరం. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ముఖ్యులకు స్వాగతం, ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషణ ఉత్సహాన్నిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక వ్యవహారాల్లో నిపుణుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. రుణసమస్యలు ఆందోళన కలిగిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. రావలసిన ధనాన్ని సౌమ్మంగా రాబట్టుకోవాలి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజం కలిగిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. సాయం ఆశించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం. ఓర్పుతో యత్నాలు సాగించండి. సన్నిహితులు హితవు మీ పై పనిచేస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.