మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. వూహాత్మకంగా అడుగులేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. అనవసర జోక్యం తగదు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. శ్రమకు తగిన ఫలితాలున్నాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. ఆహ్వానం అందుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. సావకాశంగా పనులు పూర్తిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రయాణం చికాకుపరుస్తుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుభకార్యానికి హాజరవుతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమయస్ఫూర్తిగా మెలగాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు పురమాయించవద్దు. కీలక పత్రాలు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. చేపట్టిన పనులు అర్థాంతగా ముగిస్తారు. ధైర్యంగా యత్నాలు సాగించండి. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ప్రియతముల వ్యాఖ్యలు కార్మోన్యుఖులను చేస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందజేస్తారు.